అయోధ్య తీర్పుపై సంయమనంపాటించండి;ప్రధాని

 అయోధ్య తీర్పుపై సంయమనంపాటించండి;ప్రధాని


న్యూఢిల్లీ, నవంబర్ 7 అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో మంత్రులంతా సమయమనం పాటించాలని ప్రధాని మోదీ కోరారు. క్యాబినెట్ మంత్రులకు స్వయంగా ఆయన ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది. అయోధ్య తీర్పును వినయపూర్వకంగా అంగీకరించాలని మోదీ తన క్యాబినెట్ సహచరులకు సలహా ఇచ్చినట్లు సమాచారం. తీర్పుపై అనవసర వ్యాఖ్యలు చేయరాదని వారికి ఆయన స్పష్టం చేశారు. స్నేహపూర్వ వాతావరణాన్ని ప్రదర్శించాలన్నారు. గెలుపు, ఓటమి దృష్టితో తీర్పును చూడరాదన్నారు. ఈనెల 17వ తేదీన సీజేఐ రంజన్ గగోయ్ పదవీవిరమణ చేయనున్నారు. అయితే ఈ లోపే అయోధ్య కేసులో గగోయ్ తుది తీర్పును వెలువరించనున్నారు. 


చైనాలో వజ్రాల టాయిలెట్ -


షాంఘై, నవంబరు 7(): చిత్రంలో కనిపిస్తున్న టాయిలెట్ కమోడను 40,185 వజ్రాలు, బంగారంతో తయారు చేశారు. దీని విలువ రూ. 8.5 కోట్లు. హాంకాంగ్ కు చెందిన ఆభరణాల సంస్థ ఆరోన్ షమ్ దీనిని రూపొందించింది. అత్యధిక వజ్రాలతో టాయిలెట్ కమోడను రూపొందించినట్లు గిన్నిస్ రికార్డుల్లో ఎక్కాలన్న లక్ష్యంలో సంస్థ యజమాని దీనిని తయారు చేశారు. ఇటీవల షాంఘైలో జరిగిన చైనా అంతర్జాతీయ దిగుమతుల ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టారు. -